అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర

సినీనటి, దర్శకురాలు విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని విజయ కృష్ణ ఫామ్ హౌస్‌ లో  దహన సంస్కారాలు నిర్వహించారు.  విజయ నిర్మల కొడుకు నరేష్ ఆమె చితికి నిప్పంటించారు. విజయ నిర్మలని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ఫాంహౌస్ కి భారీగా తరలి వచ్చారు.  ఆమె పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని సినీ ,రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.  అంతకు ముందు విజయ నిర్మల అంతిమ యాత్ర నానక్ రామ్ గూడలోని ఆమె ఇంటి నుండి ఫామ్ హౌస్ వరకు అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య కొనసాగింది. నానక్‌రామ్‌గూడ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు సమీపంలోని విజయ కృష్ణ గార్డెన్స్‌ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఆమె బంధువులు, సన్నిహితులు, అభిమానులు భారీగా తరలి వచ్చి విజయనిర్మలకు తుది వీడ్కోలు పలికారు.

Click to view slideshow.