టీమిండియా క్రికెటర్‌ మహమ్మాద్‌ షమీకి అరెస్ట్‌ వారెంట్

టీమిండియా క్రికెటర్‌ మహమ్మాద్‌ షమీకి అరెస్ట్‌ వారెంట్ జారీ చేయడంపై.. అతని భార్య హాసిన్‌ జహన్‌ సంతోషం వ్యక్తం చేశారు. గత యేడాది కాలంగా.. తాను న్యాయం కోసం చూస్తున్నానన్న హాసిన్‌.. కోర్టుకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో ఉన్నప్పుడు అక్కడి పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యానన్నరు. క్రికెటర్‌ షమీని 2014 లో వివాహం చేసుకున్న  హాసిన్‌.. గతేడాది అతనిపై వరకట్నం,  లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.  కేసును విచారిస్తున్న  అలీపూర్‌ కోర్టు  షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు 15 రోజుల్లోపు సరెండర్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది.