సముద్రంలో తీరంలో గబ్బర్ వేణుగానం

టీమిండియా ఓపెనర్ గబ్బర్ లో కొత్తకోణం వెలుగు చూసింది. ఓ చల్లని వాతావరణంలో శిఖర్ ధావన్‌ వేణుగానంతో అభిమానులను, నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తన ఫ్లూట్ తో క్రికెటర్లను సైతం పరవశింపజేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతర్జాతీయ ఉన్న అభిమానులు.. నెటిజన్లు సైతం గబ్బర్‌ కు వేణుగానానికి ఫిదా అయిపోయారు.

కేరళలోని సముద్ర తీరంలో కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో శిఖర్‌ ధావన్‌ తన్మయత్వంతో వేణు గానం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గురువు వేణుగోపాల స్వామి వద్ద గత మూడేళ్లుగా ఫ్లూట్ వాయించడం నేర్చుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘సరికొత్త ఆరంభం. చెట్లు, స్వచ్ఛమైన గాలి, సముద్రం. కొంత సంగీతం ఉంటే ఆశీర్వాదం అంటూ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోపై అభిమానులు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గబ్బర్ ఇది నిజంగా మీరేనా’ అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గాయంతో ప్రపంచకప్‌నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన అనంతరం ధావన్‌ విండీస్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టి20 మ్యాచ్‌లలో కలిపి అతను 27 పరుగులే చేశాడు. ప్రస్తుతం భారత్ ఎ జట్టులో మ్యాచులు ఆడుతున్నాడు. త్వరలో జరిగే సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్‌ లో పాల్గొననున్నాడు.