అశోక్‌ లేలాండ్‌ యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేత

దేశంలో అతిపెద్ద వాహన తయారీ రంగంలో ఒకటైన అశోక్ లేలాండ్ ఇప్పుడు మారుతి రూట్ ను ఫాలో అవుతోంది. ఆటోమొబైల్‌ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో ఐదు బ్రాంచెస్‌ లో ఆకస్మిక సెలవులను ప్రకటించింది.డిమాండ్‌ తగ్గడంతో సప్లయ్‌ ని తగ్గించే పనిలో పడిన అశోక్ లేలాండ్.. ఎన్నూర్‌ ప్రధాన తయారీ కేంద్రంలో 16రోజుల పాటు ఉత్పత్తి నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. ఇటు హోసూర్‌ లో 5రోజులు,అల్వార్‌ 10, బందర 10, పంత్‌ నగర్‌ లో 18రోజుల పాటు వాహనాల ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. కొన్ని రోజుల పాటు వాహనాల తయారీని నిలిపివేసినట్లు ఉద్యోగులందరికీ నోటిసులు జారీ చేసింది.