నేడు యాపిల్ మెగా ఈవెంట్‌

సాఫ్ట్‌ వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లను ఇవాళ విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నరకు యాపిల్ స్పెషల్ ఈవెంట్  జరగనుంది. కాలిఫోర్నియాలోని యాపిల్ క్యాంపస్ స్టీవ్ జాబ్స్ థియేటర్‌ లో ఈ వేడుక జరగనుంది. యాపిల్ నూతన ఐఫోన్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 5, ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ ను లాంచ్ చేయనుంది. యాపిల్ తన ఈవెంట్‌ లో ఐఫోన్ 11, 11ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ విడుదల చేయబోతుంది. వీటిల్లో యాపిల్ ఎ13 బయానిక్ ప్రాసెసర్, ఓలెడ్ డిస్‌ ప్లే, యాపిల్ పెన్సిల్‌ కు సపోర్ట్, మల్టీ యాంగిల్ ఫేస్ ఐడీ సెన్సార్, రివర్స్ వైర్‌ లెస్ చార్జింగ్, ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు సహా అధునాతన ఫీచర్లను అందివ్వనున్నట్లు సమాచారం.