ఫోక్స్‌ వ్యాగన్‌ నుంచి వీడబ్లూ ఐడీ 3 మోడల్‌ ఎలక్ట్రిక్‌ కారు

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ టెల్సా తీసుకొచ్చిన మూడో మోడల్‌కు పోటీగా ఫోక్స్‌ వ్యాగన్‌ వీడబ్లూ ఐడీ 3 మోడల్‌ పేరిట ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన మోటార్‌ షోలో ఈ కారును ప్రదర్శించారు. ఈ కారు ధర మన కరెన్సీలో 27 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఐడీ.3 ఎలక్ట్రిక్‌ కారు గంటకు 99 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఒకసారి చార్జిచేస్తే నిరాటంకంగా 420 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు.