దూసుకుపోతున్న పీవీ సింధూ

ప్రపంచ చాంపియన్‌షిప్‌తో స్వర్ణ పతకంతో కెరీర్‌ శిఖరాగ్రానికి చేరిన తెలుగు షట్లర్‌ పీవీ సింధు.. ఎండార్స్‌ మెంట్ల విషయంలోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది.  ఒక్కో ఎండార్స్‌ మెంట్‌కు రోజుకు సగటున రూ. 65 నుంచి 85 లక్షలు సింధు తీసుకుంటోంది. అయితే కొన్ని ఎండార్స్‌ మెంట్లలో ఇది రూ. 1.50 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ నెగ్గిన దరిమిలా సింధు ప్రకటనల ఫీజులో 50 నుంచి 70 శాతం పెరుగుదల సహజమేనని స్పోర్ట్స్‌ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ‘ప్రస్తుతం ప్రకటనలకు అత్యధిక మొత్తం తీసుకుంటున్న దేశ మహిళా అథ్లెట్లలో సింధు అగ్రస్థానంలో ఉంది.