తక్కువ తిన్నా.. బరువు పెరిగేది ఇందుకే!

ఆహారం తక్కువ తీసుకుంటూ, వ్యాయమం చేసినప్పటికీ బరువు పెరుగుతున్నామని బాధపడుతుంటారు కొందరు. అలా ఎందుకు జరుగుతుందో తమ పరిశోధనల్లో తేలిందంటున్నారు స్వీడన్‌ కరోలిన్‌ స్కా ఇన్‌ స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు. కొవ్వు కణజాలాల్లోని లిపిడ్ల శాతంలో తేడా రావడమే దీనికి కారణమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పదమూడేళ్ల పాటు 54 మంది పురుషులు, మహిళల కొవ్వు కణజాలాల నమూనాలను తీసుకుని పరీక్షించారు. వారందరి కొవ్వు కణజాలాల్లోనూ లిపిడ్ల శాతం బాగా తగ్గిందని వెల్లడించారు. తగ్గిన లిపిడ్ల శాతాన్ని పూర్తిగా భర్తీ చేయని వారు 20 శాతం వరకూ బరువు పెరిగారని వెల్లడించారు.