పోలీసు ఉద్యోగానికి రెజ్లర్ బబితా ఫోగాట్ రిజైన్

ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగాట్  పోలీసు ఇన్‌ స్పెక్టరు ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆమె రాజీనామాను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థినిగా బబితా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బర్దా లేదా చారఖీ దాద్రీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ పక్షాన బరిలోకి దిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 13న బబితాతోపాటు ఆమె తండ్రి మహావీర్ ఫోగాట్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలో బీజేపీలో చేరారు. నరేంద్రమోదీ విధానాలు నచ్చడంతో తాను బీజేపీలో చేరినట్లు బబితా ప్రకటించారు.