ఫోర్బ్స్‌ లిస్ట్‌ లో పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విప్ట్‌

హాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.. పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విప్ట్‌ మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.  ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న 100 మంది సెలెబ్రిటీల ఫోర్బ్స్‌ లిస్ట్‌ లో ఫస్ట్‌ ప్లేస్‌ ఆక్యూపై చేసింది. 185 మిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో నిలిచిన ఈ బ్యూటీ. 2016లో కూడా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంది.ఇక 170 మిలియన్‌ డాలర్లతో 21 ఏళ్ల జెన్నర్‌ రెండో స్థానం దక్కించుకుంది. ఇదిలా ఉంటే సాకర్‌ స్టార్స్‌ లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మర్‌, బ్రిటీష్‌ సింగర్‌ రచయిత ఎడ్‌ షీరన్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే గతేడాది ఫోర్బ్స్‌ ప్రథమ స్థానంలో నిలిచిన ఫ్లాయిడ్‌ మేవెదర్‌, రెండో స్థానంలో ఉన్న నటుడు జార్జీ క్లూనీకి ఈ సారి టాప్‌ టెన్‌లో కూడా చోటు దక్కలేదు.