రియల్‌మి తొలి 64ఎంపీ కెమెరా ఫోన్‌ విడుదల

ఒప్పో సబ్ బ్రాండ్‌ రియల్‌మి మరో నూతన ఫోన్‌ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా 64 మెగా పిక్సల్‌ ఉన్న ‘రియల్‌మి ఎక్స్‌ టీ’ కెమెరా ఫోన్‌ ను వినియోగదారులకు పరిచయం చేసింది. నాలుగు కెమెరాలు ఉన్న ఈ ఫోన్‌ ఫీచర్లు కూడా స్మార్ట్ ఫోన్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 64, 8, 2, 2 ఎంపీ రెయిర్ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ మొబైల్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. పెరల్ వైట్, పెరల్ బ్లూ రంగుల్లో మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999 గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999 గా, 8 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,999 గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి సైట్లలో ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. తొందర్లోనే ఆఫ్‌లైన్‌ పలు బ్రాంచీల్లో మొబైల్ ను అందుబాటులో ఉంచనున్నట్లు రియల్‌మి వెల్లడించింది.