గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిని యాంకర్‌ అనుసూయ

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్  మొదలు పెట్టిన గ్రీన్ ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను యాంకర్ అనసూయ స్వీకరించారు. ఈ మేరకు కేబీఆర్ పార్క్ ముందు జీహెచ్ఎంసీ ఏరియాలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత తన కొడుకుతో పాటు.. యాంకర్ సుమా కనకాల, నటులు అడివి శేషు, ప్రియదర్శి, డైరెక్టర్ వంశీ పైడిపల్లిని తలా మూడు మొక్కలు నాటాల్సిందిగా ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్  ను మొదలుపెట్టి… కీసర అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అనసూయ అభినందించారు. గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని యాంకర్ అనసూయ పిలుపునిచ్చారు.