సుధీర్‌ బాబు కసరత్తులు.. వీడియో వైరల్

సుధీర్‌ బాబు.. కొంచెం గ్యాప్‌ తీసుకుని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వీ’ చిత్రంలో నటిస్తున్నారు. అందుకోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌ను రూపొందించే పనిలో పడ్డారు. ఇంతకముందే సుధీర్‌బాబు బ్యాడ్మింటర్‌ ప్లేయర్‌ కావడంతో కొంచెం ఈజీ అయినా.. ఆ పాత్రకోసం సుధీర్‌ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

తన చిత్రం కోసం కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కారును ముందుకు తోస్తూ చాలా కష్టపడుతున్నాడు. పక్కనే ఉన్న ట్రైనర్‌ సపోర్ట్ చేస్తూ సలహాలు ఇస్తున్నాడు. హైవేపై కారును తోస్తున్న సుధీర్‌.. తన శరీరాకృతిని మార్చుకునేందుకు భారీ కసరత్తులు చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.