సమారానికి సమాయత్తం

వెస్టిండీస్ టూర్ లో అన్ని సిరీస్‌లను గెలుచుకొని.. క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ధనాధన్‌ సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీట్వంటీ సిరీస్‌లో   గెలుపే లక్ష్యంగా  భారత్ బరిలోకి దిగుతోంది. అటు ప్రపంచ కప్‌ తర్వాత జరగనున్న తొలి పర్యటనలో గెలవాలనే కృతనిశ్చయంతో దక్షిణాఫ్రికా ఉన్నది. మూడు  మ్యాచ్‌ల ధనాధన్‌ సిరీస్‌లో ఇవాళ ధర్మశాల వేదికగా తొలి టీట్వంటీ మ్యాచ్‌ జరగనున్నది.  2020 ప్రపంచ కప్‌ ను దృష్టిలో పెట్టుకొని.. దక్షిణాఫ్రికా  కుర్రాళ్లకు పెద్దపీట వేయగా.. టీమిండియా అటు యువకులు, ఇటు సీనియర్లతో సమతూకంగా  ఉన్నది.

వన్డే ప్రపంచ కప్‌ మిస్‌ అయినా.. 2020 టీట్వంటీ కప్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుంది. అందులో భాగంగానే.. జట్టు ఎంపీకలో కుర్రాళ్లకు పెద్దపీట వేశారు. బ్యాటింగ్‌ అర్డర్‌లో సీనియర్లు కోహ్లీ, రోహిత్‌, మనీష్‌ పాండేలు ఉన్నా.. బౌలింగ్‌ లో మాత్రం అందరూ కొత్తవారే.  సీనియర్‌ పేసర్లు షమీ,  బుమ్రా, భువీలకు విశ్రాంతి ఇవ్వగా.. స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ లకు కూడా జట్టులో లభించలేదు. అయితే కరేబియన్‌ పర్యటనలో రాణించిన దీపక్‌ చాహర్‌, కృనాల్‌ పాండ్యా, నవదీప్‌ సైనీ, ఖలీల్‌ అహ్మద్‌ లు.. సొంతగడ్డపై రాణించాలని కోరుకుంటున్నారు.                అటు దక్షిణాఫ్రికా జట్టంతా.. కుర్రాళ్లతో నిండిపోయి ఉన్నది.  కొత్త కెప్టెన్‌ డికాక్, రబాడాలు తప్పా.. మిగతా టీమ్‌ సభ్యులంతా కొత్తవారే. దాంతో టీమిండియాతో పోరులో భారమంతా.. డికాక్‌, రబాడా, డసెన్‌లపైనే ఉన్నది. సౌత్‌ ఆఫ్రికా యువకులతో నిండి ఉన్నా.. ఏ మాత్రం పొరపాటు చేసినా భారత్ కు భంగపాటు తప్పదు.  భారత్‌ లో దక్షిణాఫ్రికా జట్టుకు మెరుగైన రికార్డ్‌ ఉన్నది. ఇప్పటి వరకు టీమిండియా స్వదేశంలో ఒక్క మ్యాచ్‌లో కూడా దక్షిణాఫ్రికా పై గెలవలేదు. 2015లో భారత్‌ లో పర్యటించిన ప్రొటీస్‌ 2-0 తేడాతో టీట్వంటీ సిరీస్‌ గెలిచింది.  దాంతో ఈ సారైన దక్షిణాఫ్రికా పై సిరీస్ గెలవాలని కోహ్లీ సేన కసితో ఉంది.