ప్రధాని మోడీ బయోపిక్‌ విడుదల చేసిన ప్రభాస్‌

ప్రధాని నరేంద్ర మోడీపై మరో చిత్రం తెరకెక్కించనున్నారు. మోడీ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను అన్‌ టోల్డ్ స్టోరీగా ‘మన్‌ బైరాగీ’ సినిమాలో చూపించనున్నారు. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ ను యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. అదే ఫస్ట్ లుక్‌ ను అక్ష‌య్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రియు మ‌హావీర్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో పీఎం నరేంద్రమోడీ పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మోడీ పాత్ర‌లో వివేక్ ఒబేరాయ్ క‌నిపించారు. ఇప్పుడు మోదీ చరిత్రను ప్రతీ ఒక్కరికీ తెలిసే విధంగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ‘మ‌నో విరాగి’ పేరుతో రిలీజ్ కానుంది.