పాక్‌ క్రికెటర్లకు బిర్యానీ, స్వీట్స్‌ బంద్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ ఆటగాళ్లకు నూతన కోచ్‌ పాత ఆహారపు అలవాట్లను మెను నుంచి తొలగించారు. కొత్త  కోచ్‌గా నియమితులైన మిస్బా ఉల్‌ హక్‌.. ఆటగాళ్లు ఫిట్‌నెస్‌గా దృఢంగా ఉండాలంటే.. కచ్చితంగా బిర్యానీ, ఆయిల్ ఫుడ్‌, స్వీట్స్‌ లాంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని చెప్పారు. క్రికెట్ బాగా ఆడాలంటే వాళ్లు ఫిట్‌నెస్‌ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి.. అందుకే వారికి స్వీట్స్‌, బిర్యానీ, పిజ్జా, బర్గర్‌, దున్న మాంసం ఇవ్వబోమని చెప్పారు.

ఇటీవల పాక్‌ టీ-20ల్లో మినహా మిగితా ఫార్మట్స్‌లో విఫలమవుతుండడంతో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టారు. క్రికెటర్లకు ఆరోగ్యకరమైన ఆహారం, న్యూట్రిషియన్స్‌ గల ఫుడ్‌ను అందిచాలనుకుంటున్నట్లు కోచ్‌ మిస్బా నిర్ణయించారని పాక్‌ జర్నలిస్ట్‌ సాజ్‌ సాదిక్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.
కాగా, మిస్బా ఉల్‌ హక్‌.. పాకిస్తాన్‌ క్రికెట్‌ హెడ్‌కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌గా రెండు బాధ్యతలు స్వీకరించాడు. ఆయనతో పాటు బౌలింగ్‌ కోచ్‌గా వకార్‌ యూనిస్‌ భాద్యతలు చేపట్టారు. బుధవారం నుండి ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు.