నీటమునిగిన పవిత్ర గంగా నదీ స్నానఘట్టాలు

ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానలతో గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది.  వరదలు పోటెత్తడంతో వారణాసీలోని పవిత్ర గంగా నదీ స్నానఘట్టాలు నీట మునిగాయి. తీరప్రాంతంలో వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇక గంటగంటకూ నీటి మట్టం పెరుగుతుండటంతో కాశీ ప్రజలు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తులు స్నానం చేసేందుకు గంగానదిలోకి దిగకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.