అఫ్గానిస్తాన్‌ ఆత్మాహుతి దాడుల్లో 48కి చేరిన మృతుల సంఖ్య

అఫ్గానిస్తాన్‌ లో తాలిబన్ల ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 48కి చేరింది. 80మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. గంట వ్యవదిలో రెండు చోట్ల జరిగిన పేలుళ్లతో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. మొదటి ఆత్మాహుతి దాడి ఆ దేశ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారంలో కాగా, రెండోది కాబూల్‌లో చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్‌ హెచ్చరించింది.