గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన ఆస్ట్రేలియా మంత్రి..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్  ఖండాంతరాలు దాటింది. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి.. మొక్కలను నాటారు. తమవంతుగా ఇతరులను మొక్కలు నాటాల్సిందిగా కోరారు. తాజాగా ఆస్ట్రేలియా డిప్యూటీ మినిస్టర్ జాసన్ వుడ్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలను నాటారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను ఆయన స్వీకరించారు. తెలంగాణ సమాజానికి ఇంత మంచి కార్యక్రమం అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను జాసన్ వుడ్ అభినందించారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వామి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని ఆస్ట్రేలియా మంత్రి జాసన్ వుడ్ చెప్పారు.