జమ్మూకశ్మీర్‌లో రైళ్లు తిరిగి ప్రారంభం

మూడు నెలల విరామం తరువాత జమ్మూకశ్మీర్‌లో రైళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రైల్వేశాఖ రేపటి నుంచి శ్రీనగర్ కు సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకోసం శ్రీనగర్‌లో రైళ్ల ట్రాక్ తనిఖీ, ట్రయల్ రన్‌ను రైల్వే అధికారులు నిర్వహించారు. ఆర్టికల్ 370 ను రద్దు నేపత్యంలో ఆగస్టు 5 నుండి జమ్మూ లోయలో రైల్వే సేవలు నిలిచిపోయాయి.