పాక్ మ్యూజియంలో వింగ్‌కమాండర్ బొమ్మ

పాకిస్థాన్ వాయుసేన వార్ మ్యూజియంలో భారత వాయుసేన వింగ్‌కమాండర్ అభినందన్ వర్ధమాన్ బొమ్మను కొలువుదీర్చారు. దాని పక్కనే చాయ్ కప్పును ఉంచారు. ఈ ఫొటోను పాకిస్థానీ జర్నలిస్ట్ అన్వర్ లోధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడి సందర్భంగా ఆ దేశ సైన్యం అభినందన్ నడుపుతున్న విమానాన్ని కూల్చి, ఆయనను అదుపులోకి తీసుకొని, కొన్ని రోజుల తర్వాత భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా పాక్ సైన్యం విడుదలచేసిన వీడియోలో అభినందన్ చాయ్ తాగుతూ కనిపించారు.