మర్మాట్‌ ప్రాంతంలో అర్థరాత్రి ప్రమాదం

అర్థరాత్రి జమ్మూకశ్మీర్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. దోడా జిల్లా మర్మాట్ ప్రాంతంలో వాహనం లోయలో పడిన ఘటనలో 16 మంది చనిపోయారు. గోవా గ్రామం మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 700 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు హాస్పిటల్‌ కు తరలించేలోపే చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులున్నారంటున్నారు అధికారులు.ఇక ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.