ఇటలీనీ ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ఇటలీనీ భీకర తుపానులు ముంచెత్తుతున్నాయి. నీటిపై తేలియాడే నగరం వెనిస్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాలు,వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.వెనిస్‌ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్మసిక వరదలతో ఇటు పర్యాటకులు అవస్తలు పడుతున్నారు. హోటళ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.