
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. 11వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆయన బ్రసెల్స్ నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఎయిర్ పోర్టులో బ్రెజిల్ అధికారులు సైనిక వందనంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ.. అక్కడి అధికారులు, సైనికులకు పరిచయం చేసుకున్నారు. విజిటర్స్ బుక్ లో తన సందేశాన్ని రాశారు. ఇవాళ, రేపు బ్రిక్స్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై చర్చిస్తారు.