నీతా అంబానీకి అరుదైన గౌరవం

భారత వ్యాపార దిగ్గజం ముఖేష్‌ అంబానీ భార్య నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియానికి ఆమె పేరు పెట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. మ్యూజియం ధర్మకర్తగా ఆమెను ఎన్నుకున్న బోర్డు సభ్యులు..నీతా అంబానీ భారతదేశ కళలను, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. మ్యూజియానికి తన పేరును పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన నీతా అంబానీ.. 149 సంవత్సరాల పురాతన మ్యూజియాన్ని చూడటానికి మిలియన్ల మంది బిలియనీర్లు, ప్రముఖులు వస్తుంటారని తెలిపారు.