భారత్, చైనా, రష్యాపై ట్రంప్ ఆరోపణలు

చైనా, భారత్, రష్యాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఆయా దేశాలు సముద్రంలో పడేస్తున్న చెత్తంతా లాస్ ఏంజిల్స్‌కు చేరుతున్నదని ఆరోపించారు. ఈ దేశాలు తమ పారిశ్రామిక ప్లాంట్లు, పొగ కారక గొట్టాలను శుభ్రపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పర్యావరణ మార్పులను చాలా సంక్లిష్టమైన అంశాలుగా అభివర్ణించిన ట్రంప్.. తనకు తాను పర్యావరణవేత్తగా చెప్పుకొన్నారు. అయితే పారిస్ పర్యావరణ ఒప్పందం ఏకపక్షమైనదని, దారుణమైనదని విమర్శించారు.