ఘనంగా జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలు

ఢిల్లీలో జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ 129వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని శాంతివనం దగ్గర కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఘనంగా నివాళ్లు అర్పించారు. మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు నేతలు శ్రద్దాంజలి ఘటించారు. ఇక బ్రెజిల్‌ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ట్విట్టర్‌ లో నెహ్రూకి నివాళ్లు అర్పించారు.