బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న అనర్హత ఎమ్మెల్యేలు

కర్నాటకలో కుమారస్వామి సర్కారును కూల్చిన 17 మంది ఎమ్మెల్యేలు ఇవాళ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంతో ఇప్పటికే పదవులు కోల్పోయిన వీరంతా.. ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. సీఎం యడియూరప్ప బుధవారం నిర్వహించిన పార్టీ కోర్‌ కమిటీ భేటీలోనూ వారి రాకను స్వాగతిస్తూ తీర్మానించారు. అదే సమయంలో ఈ 17 మందికీ రానున్న ఎన్నికల్లో భాజపా టిక్కెట్లు ఇచ్చే అంశం అధిష్ఠానం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.