
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. కాలుష్యం కారణంగా ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది కేజ్రీవాల్ సర్కార్. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించని పరిశ్రమలను కూడా రెండు రోజుల పాటు మూసివేయాలని ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.