గోల్డెన్‌ డెన్‌ గా చెన్నై ఎయిర్‌ పోర్ట్‌

చెన్నై ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇంటలీజెన్స్ సమాచారంలో తనిఖీలు చేసిన అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 12కేజీల పసిడిని పట్టుకున్నారు. రూ. 50లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో మూడున్నర కోట్ల వరకు ఉంటుందంటున్నారు అధికారులు.