బీజేపీలో చేరిన కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బెంగుళూరులోని బీజేపీ కార్యాలయంలో సీఎం యెడియూరప్ప సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.  17 మంది ఎమ్మెల్యేలపై మాజీ స్పీకర్ వేసిన అనర్హత వేటు కేసులో నిన్ననే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఉప ఎన్నికల్లో పోటీ చేయొచ్చని రెబెల్స్ కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. అయితే మొదటి నుంచి రెబెల్స్ కు అండగా ఉంటామని చెబుతూ వచ్చిన యెడియూరప్ప చివరకు సమక్షంలో కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన నేతలు బీజేపీలో చేరారు.