విస్తృత ధర్మాసనానికి శబరిమల వివాదం కేసు

శబరిమల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశం రివ్యూ పిటిషన్‌ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. కేసును ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తీర్పును పునః సమీక్షించాలన్న పిటిషన్ లను పెండింగ్‌ లో ఉంచింది. అయితే మెజార్టీ జడ్జీల అభిప్రాయంతో విభేదించారు జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌ లు. మెజార్టీ తీర్పుతో మత విశ్వాసాలను తక్కువ చేయడం తగదన్నారు నారిమన్‌.