నా ఈ స్థాయికి కారణం ధోని

టీమిండియా యువ సంచలనం, బౌలర్ దీపక్ చాహర్.. మాజీ కెప్టెన్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. తాను ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఒక రికార్డును ఎంజాయ్‌ చేస్తున్నానంటే అందుకు ధోని కారణమన్నాడు. ధోని తనను ఎక్కువగా ప్రోత్సహించేవాడన్న చాహర్.. తన బౌలింగ్‌పై నమ్మకం ఉంచి పదే పదే అవకాశాలు కల్పించాడన్నారు. ధోని ప్రోత్సాహం, సూచనల వల్లే తానను రాటుదేలేలా చేశాయని చాహర్ స్పష్టం చేశాడు.