రష్యా విక్టరీ డే వేడుకలకు మోదీకి ఆహ్వానం

వచ్చే ఏడాది జరిగే  విక్టరీ డే సెలబ్రెషన్స్‌ కు భారత ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానించారు. మాస్కోలో 2020 మేలో విక్టరీ డే సెలబ్రెషన్స్‌ లో రష్యా తన సైనిక శక్తిని ప్రదర్శించనుంది. నాజీ జర్మనీపై మిత్రదేశాలు సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ వీటిని నిర్వహిస్తారు. ఈ సెలబ్రెషన్స్ లో పాల్గొనాల్సిందిగా పుతిన్.. మోదీని ఆహ్వానించారు. బ్రెజిల్‌లో జరుగుతున్న 11వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇరు దేశాధినేతలు కలుసుకున్నారు.