శబరిమల కేసు సుప్రీం విస్తృత బెంచ్‌కు బదిలీ

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసును.. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత బెంచ్‌కు బదిలీ చేస్తూ ఐదుగుసభ్యుల ధర్మానసం తీర్పునిచ్చింది. బెంచ్‌లోని ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు న్యాయమూర్తులు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మతంలోకి చొచ్చుకు వెళ్లే అధికారం కోర్టుకు ఉందా? లేదా? అనే అంశం చర్చకు వచ్చిందని వ్యాఖ్యానించారు. మత విధానాలు, నైతికత ప్రజా ఆదేశాలకు భిన్నంగా ఉండకూడదన్నారు.