ఏడుగురికి కేబినెట్ స్థానం కల్పించిన సీఎం ఖట్టర్

హర్యానా మంత్రివర్గాన్ని విస్తరించారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. మొదటి విడత విస్తరణలో అనిల్ విజ్, కన్వర్ పాల్, సందీప్ సింగ్ తోపాటు..ఏడుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యా కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. కాగా..ఇప్పటికే జేజేపీ చీఫ్‌ దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవితో పాటు దాదాపు 11 శాఖలన కేటాయించారు ఖట్టర్.