2020 టోక్యో ఒలింపిక్స్‌ నుంచి రష్యా బహిష్కరణ

అంతర్జాతీయ క్రీడా సమాజం రష్యాను గెంటేసింది. డోపింగ్‌ భూతం రష్యాను ప్రపంచదేశాల ఎదుట దోషిగా నిలిపింది. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌ కు దూరం చేసింది. వ్యవస్థీకృత డోపింగ్‌ కారణంగా… ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. సోమవారం స్విట్జర్లాండ్‌ లో జరిగిన డోపింగ్‌ నిరోధక సంస్థ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో రష్యా క్రీడా సమాజం తీవ్రంగా నష్టపోనుంది. 2020 పారాలింపిక్స్, 2022 యూత్‌ ఒలింపిక్స్, 2022లో బీజింగ్‌ ఆతిథ్యమివ్వనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ లో రష్యా జట్లేవీ బరిలోకి దిగవు. వచ్చే నాలుగేళ్లలో ఆ దేశం అంతర్జాతీయ క్రీడా పోటీల ఆతిథ్యానికి కూడా పనికిరాదు.