స్టేడియంలోకి పాము.. మ్యాచ్‌కు అంతరాయం!

క్రికెట్‌ స్టేడియంలోకి  పాము రావడంతో కాసేపు రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. 2019-20 రంజీ ట్రోఫీలో భాగంగా విజయవాడలో ఆంధ్ర – విదర్భ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విదర్భ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే స్టేడియంలో పాము ప్రత్యక్షమైంది. దీంతో ఫీల్డింగ్‌లో ఉన్న ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. అంపైర్లు మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు. పామును స్టేడియం నుంచి బయటకు పంపించిన తర్వాత తిరిగి మ్యాచ్‌ను ప్రారంభించారు. స్టేడియంలో పాము వచ్చిన దృశ్యాలను బీసీసీఐ డొమెస్టిక్‌ తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేసింది.