ఉప్పల్ మైదానంలో ఉప్పెనలా విరాట్‌

ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారింది. ఫస్ట్ టీ-ట్వంటీ మ్యాచ్ లో విండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హోరాహోరీగా సాగిన పోరులో విరాట్ కోహ్లీ 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 62 పరుగులతో ఆకట్టుకున్నడు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేసింది. విండీస్ తో టీ-20 సిరీస్‌ లో భారత్ బోణీ కొట్టింది. విండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ వీర విహారం చేయడంతో ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన పోరులో విరాట్ కోహ్లీ 94 పరుగులు, కేఎల్ రాహుల్ 62 పరుగులు చేశారు. భారీ లక్ష్యమైనా ఎలాంటి ఆందోళనకు గురికాకుండా టార్గెట్ ఛేజ్ చేశారు. ఆఖర్లో బ్యాట్ ఝుళిపించిన విరాట్ కోహ్లీ.. చెత్త బంతులను బౌండరీలకు తరలించడంతో పాటు సిక్సర్ల మోత మోగించారు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో భారత్ విజయం ఖాయమైంది. రోహిత్ శర్మ8, రిషబ్ పంత్ 18, శ్రేయాస్ అయ్యర్4 పరుగులకే ఔటై.. నిరాశపరిచారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే దీపక్ చాహర్ విండీస్‌కు షాకిచ్చాడు. చాహర్ బౌలింగ్‌లో ఓపెనర్ లెండిల్ సిమన్స్ ఔటయ్యాడు. అనంతరం హెట్‌మైర్ 56 పరుగుల చేసి అర్ధశతకంతో రాణించాడు. ఆఖర్లో హోల్డర్ 9 బంతుల్లో 24 రన్స్ చేయడంతో ప్రత్యర్థి జట్టు అలవోకగా భారీ స్కోరు చేయగలిగింది. బ్రాండన్ కింగ్31, హోల్డర్24, దినేశ్ రాందిన్ 11 పరుగులు చేశారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 5 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లు ఆరంభంలో కరీబియన్ల వేగానికి అడ్డుకట్ట వేసినప్పటికీ ఆఖరి ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చాడు. ఈ విజయంతో మూడు టీ-20ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేసింది. 94 పరుగులతో టీమిండియాను విజయతీరాలకు నడిపిన విరాట్ కోహ్లీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.