ఓటుహక్కును వినియోగించుకున్న క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఉస్‌ ధోనీ

రాంచీ లో క్రికెట్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ మూడవ విడత ఎన్నికలు జరుగుతుండగా, రాంచీలోని జీవీఎం స్కూల్ లో ఉన్న పోలింగ్‌ బూత్‌ లో ధోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ  ఎన్నికలను ఈసీ ఐదు విడతల్లో నిర్వహిస్తుండగా, ఇవాళ్టితో మూడు విడతలు పూర్తి అయ్యాయి. ఈనెల 21న ఫలితాలు విడుదలకానున్నాయి.