ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మల సీతారామన్‌కు చోటు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన తొలి 100 మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్‌ జాబితాలో.. నిర్మలా సీతారామన్‌కు 34వ స్థానం లభించింది. భారత్‌ తరపున ఈ ఏడాది అత్యుత్తమ స్థానం అదే. ఫోర్బ్స్‌ జాబితాలోకి చోటు దక్కడం సీతారామన్‌కు ఇదే తొలిసారి. సీతారామన్‌తోపాటు భారత్‌ తరఫున హెచ్‌సీఎల్‌ సీఈవో రోష్ని నాడార్‌ మల్హోత్రా 54వ స్థానాన్ని, బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందార్‌ షా 65వ స్థానాన్ని దక్కించుకొన్నారు. ఈ జాబితా తొలిస్థానాన్ని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌ పొందారు.