జపాన్‌ ప్రధాని పర్యటన వాయిదాపై మమత విమర్శలు

జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటనను రద్దుచేసుకోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది మన దేశానికే మాయని మచ్చ అంటూ విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం కారణంగా అసోంలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో అబే తన భారత పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే త్వరలోనే జపాన్‌ ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఉంటుందని విదేశాంగ శాఖ వెల్లడించింది.