గౌహతిలో కర్ఫ్యూ ఆంక్షల ఎత్తివేత

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుతో అసోం దద్దరిల్లింది. నిరసనల నేపథ్యంలో అసోంలో కర్ఫ్యూ విధించారు. దీంతో ప్రజలు మరింత ఆగ్రహానికి లోనై కర్ఫ్యూ సైతం లెక్కచేయకుండా రోడ్లపైకొచ్చి ఆందోళన చేశారు. అయితే ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు గౌహతిలో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్టు అసోం ప్రభుత్వం ప్రకటించింది. కాగా పౌరసత్వ చట్ట సవరణకు  వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు.