పాస్ పోర్టుల్లో కొత్త మార్పులు

కేరళలోని కోజికోడ్ లో పంపిణీకి సిద్ధంగా ఉన్న పాస్ పోర్టు పుస్తకాల్లో కమలం చిహ్నాన్ని ముంద్రించినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణలపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. నకిలీ పాస్ పోర్టులను గుర్తించడం, భద్రతా ప్రమాణాల పెంపుదలలో భాగంగానే కొత్త పాస్ పోర్టు పుస్తకాలపై కమలం చిహ్నాన్ని ముద్రించామని తెలిపింది. ఒక్క చిహ్నాలే కాదు, కొత్త పాస్ పోర్టుల్లో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతంలో పాస్ పోర్టు రెండో పేజీలో అధికారి సంతకం ఉండేది. ఇప్పుడు ఈ స్థానంలో కమలం గుర్తు ఉండనుంది. వంతుల వారీగా ఇతర జాతీయ చిహ్నాలను ఆ స్థానంలో ముద్రించనున్నారు. పాత పాస్ పోర్టులో వ్యక్తి పేరు, చిరునామా, ఇతర వివరాల కోసం వేర్వేరు కాలమ్స్ ఉండేవి. కానీ కొత్త పాస్ పోర్టులో వేర్వేరు కాలమ్స్ ఉండవు. పాస్ పోర్టుల కోడ్ లలోనూ మార్పులు చేశారు.