సిద్ధివినాయకుడి ఆలయంలో దీపిక ప్రత్యేక పూజలు

బాలీవుడ్‌ అగ్ర నటి దీపిక పదుకొనె ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె నటించిన చపాక్‌ సినిమా ఇవాళ విడుదలైన సందర్భంగా ఆమె గణనాథుడిని దర్శించుకున్నారు. యాసిడ్‌ దాడి బాధితురాలు జీవితాన్ని ఆధారంగా చేసుకుని చపాక్‌ సినిమా రూపొందింది. ఇందులో దీపిక నటనకు ప్రశంసలు అందుతున్నాయి. సమాజంలో యాసిడ్‌ దాడికి గురైన వారిపట్ల సానుకూలంగా స్పందించాలనే విషయాన్ని ఈ సినిమా తెలియచేస్తుంది. సామాజిక బాధ్యతతో తీసిని ఈ సినిమా కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్నును మినహాయించాయి.