అభిమానుల‌కు  సినీ ప్ర‌ముఖుల భోగి, సంక్రాంతి శుభాకాంక్ష‌లు

తెలుగు లోగిళ్ళ‌లో సంక్రాంతి సంద‌డి నెల‌కొంది. న‌గ‌రాల నుండి ప‌ల్లెల‌కి వెళ్లిన ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పెద్ద పండుగ‌ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ఈ రోజు భోగి పండుగ సంద‌ర్బంగా ఉద‌యాన్నే లేచి భోగి మంట‌లతో స‌రికొత్త ఉద‌యానికి శ్రీకారం చుట్టారు. టాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు త‌మ అభిమానుల‌కి భోగి పండుగ‌తో సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్, అనీల్ రావిపూడితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ అందించారు.