బాలీవుడ్‌ బ్యూటీకి చురకలంటించిన యోగా గురువు

కాల్చకుండానే వాతలెలా పెట్టాలో ప్రముఖ యోగా గురువు రామ్‌ దేవ్ బాబాకు తెలిసినంతగా మరెవరికి తెలీదు. తాజాగా ఆయన  బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణెకు చురకలంటించారు.జేఎన్ యూ ఘటనలో ఐషేగోష్‌ ను పరామర్శించిన ఆమెపై విమర్శలు గుప్పించారు. , దేశ సామాజిక‌, ఆర్ధిక ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు తనలాంటి స‌ల‌హాదారుడిని నియ‌మించుకొవాలని సూచించారు.  నటన విషయంలో దీపికను పొగుడుతూనే.. ఏదైనా విషయం మాట్లాడేముందు ఆలోచించాలన్నారు.