స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్‌… ఊగిసలాటలోనే కొనసాగింది. దీంతో… సెన్సెక్స్‌ 92 పాయింట్లు లాభపడి.. 41,952 వద్ద ముగించింది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12,362 దగ్గర స్థిరపడింది. మరో రెండు రోజుల్లో అమెరికా -చైనా మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందం ప్రభావం మార్కెట్లపై కనిపించలేదు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 70.84 గా కొనసాగుతోంది. కాగా… వేదాంత, బ్రిటానియా, హీరో మోటర్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో పయనించగా.. యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌, యూపీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కొటక్‌ మహీంద్రా షేర్లు నష్టాలతో ముగిశాయి.