లెబనాన్‌ లో మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు

లెబనాన్‌ లో సద్దుమణిగిన ఆందోళనలు ఉన్నట్టుండి మళ్లి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ట్రిపోలీ, అక్కార్‌ ప్రావిన్స్‌ల్లో నిరసనకారులు కదంతొక్కారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇటు బీరుట్‌ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో మారుమ్రోగింది. పెద్ద ఎత్తున నగరవీధుల్లోకి చేరుకున్న ఆందోళనకారులు.. జాతీయ పతాకాలు, ప్లకార్డులు, బ్యానర్లతో నిరసనలు తెలిపారు.  రహదారులపై టైర్లు దహనం చేసి.. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. లెబనాన్‌ సర్కార్‌ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇదిలాఉంటే గతేడాది అక్టోబర్‌ 29 నుంచి లెబనాన్‌ లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రజాందోళలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని సాద్‌ హరీరీ తన పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్‌లో హస్సన్‌ దియాబ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, దియాబ్‌ కూడా మాజీ ప్రధాని పంథానే అనుసరిస్తుండటంతో ప్రజాందోళలు మరోసారి భగ్గుమన్నాయి.