నష్టాల్లో ముగిసిన మార్కెట్లు…

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టపోయి 41,872 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 12,343 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 70.86 వద్ద కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో నమోదయిన సూచీలు.. బుధవారం మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటంతో నష్టాల్లో కొనసాగాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యస్‌ బ్యాంకు, హీరో మోటర్స్‌, టాటా మోటర్స్‌, టైటాన్‌ కంపెనీ, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో పయనించగా.. ఇండస్‌ ఇండ్‌, విప్రో, భారత్‌ పెట్రోలియం, ఎస్బీఐ, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.